
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)
చేవెళ్ల బస్సు ప్రమాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ప్రమాదానికి చాలా మంది కారణమని అన్నారు. 2016లో బీజాపూర్ జాతీయ రహదారి ప్రకటించారు. రియల్ ఎస్టేట్ కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదు. కేవలం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదానికి కారణం వందకు వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ దాహానికి ప్రజలు బలి అవుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే.. చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్నది. డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జాతీయరహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను నివేదిక పంపాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..