
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)
పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని
కోరుకుంటోందని, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ బృందంతో భేటీ అయ్యారు. డాయిచ్ బోర్సే కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో ఇవాళ తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభిస్తున్నట్లు సీఎంకు జర్మనీ బృందం వివరించింది. GCC ఏర్పాటుకు గాను తమ సిటీని ఎంచుకున్నందుకు వారికి సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ప్రపంచ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. అందుకు ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. హైదరాబాద్లో నెలకొల్పబోయే ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోందని అన్నారు. ఇక హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు