
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ మరోసారి డ్రగ్స్ పార్టీ
ని పోలీసులు భగ్నం చేశారు. కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న డ్రగ్స్ మాఫియా కదలికలు మళ్లీ చెలరేగాయి. ఐటీ హబ్ గచ్చిబౌలిలో కో-లివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న రహస్య డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో వారి వద్ద నుంచి ఎండీఎంఏ (MDMA), గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు విక్రయిస్తున్న ప్రధాన స్మగ్లర్ గుత్తా తేజ కృష్ణ ఈ నెట్వర్కు నాయకత్వం వహిస్తున్నాడు.
తనతో పాటు డ్రగ్స్ సరఫరా లో పాల్గొన్న ఒక నైజీరియన్ పౌరుడిని కూడా గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇద్దరూ కలిసి కర్ణాటక నుంచి మాదక ద్రవ్యాలను రవాణా చేసి, నగరంలోని యువతకు అమ్ముతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దాడి సందర్భంగా పోలీసులు గెస్ట్ రూమ్ నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న పలు యువకులను పట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..