కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలకు అనుమతి!
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో జరగనున్న బీఆర్ఎస్ రోడ్ షోలకు పోలీసుల అనుమతి లభించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ మరో కీలక నేత హరీష్ రావుల రోడ్ షోలకు నగర సీపీ సజ్జనార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమే
కేటీఆర్, హరీష్ రావు


హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో

జరగనున్న బీఆర్ఎస్ రోడ్ షోలకు పోలీసుల అనుమతి లభించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ మరో కీలక నేత హరీష్ రావుల రోడ్ షోలకు నగర సీపీ సజ్జనార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బీఆర్ఎస్ నేతలు దూదిమెట్ల బాలరాజు యాదవ్, నాగేందర్ గౌడ్, కిషోర్ గౌడ్ు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలిసి వినతిపత్రం అందించగా, అందుకు సానుకూల స్పందన వచ్చింది. అలాగే రోడ్ షోలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, జనం ప్రచారానికి తరలివస్తున్న నేపథ్యంలో వీడియో చిత్రీకరణ కోసం, నాయకులు-కార్యకర్తలపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున పూర్తి సెక్యూరిటీ ఆధీనంలో డ్రోన్లు వినియోగిస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande