ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ.. మరోసారి షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ విడ
ఎమ్మెల్యేల అనర్హత


హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత

పిటిషన్పై విచారణ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ విడుదల చేశారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లాం వెంకట్రావు, అరికెపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై ఈనెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ చేపడతామని, మొదట పిటిషనర్లు.. ఆ తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నారు. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande