సుక్మా అడవుల్లో సంచలనం.. మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం
సుక్మా, 4 నవంబర్ (హి.స.) అగ్రనేతల లొంగుబాట్లు, కాల్పుల విరమణతో సతమతమవుతోన్నన్న మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సుక్మా జిల్లా అడవుల్లో భద్రతా దళాలు చేపట్టిన కూబింగ్ ఆపరేషన్లో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి.
మావోయిస్టులు


సుక్మా, 4 నవంబర్ (హి.స.)

అగ్రనేతల లొంగుబాట్లు, కాల్పుల

విరమణతో సతమతమవుతోన్నన్న మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సుక్మా జిల్లా అడవుల్లో భద్రతా దళాలు చేపట్టిన కూబింగ్ ఆపరేషన్లో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని గోంగూడ -కంచాల అడవుల్లో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard) బలగాలు చేపడుతున్న సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల ఆయుధ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతం నుంచి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాల తయారీ సామగ్రి, పరికరాలను, విప్లవ సాహిత్యాన్ని సైతం స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవడాన్ని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన డీఆర్ దళాలు చేపట్టిన కూబింగ్ ఆపరేషన్ను ప్రశంసించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande