నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లో కొత్త మార్పు.. ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్‌లో ప్రీ-ఓపెన్ సెషన్.. వివరాలు ఇలా..!
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
Bombay Stock Exchange


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.cf5{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ముంబై, 04, నవంబర్ (హి.స.)నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్విటీ డెరివేటివ్స్ (F&O) విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త మెకానిజం డిసెంబర్ 8వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ అధికారిక ప్రక్రియకు ముందు సభ్యులు అప్‌డేట్ చేసిన సిస్టమ్, కాంట్రాక్ట్ ఫైల్‌లను పరీక్షించడానికి వీలుగా డిసెంబర్ 6వ తేదీన మాక్ ట్రేడింగ్ నిర్వహించబడుతుందని NSE ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ పక్రియ ప్రధానంగా మార్కెట్ ప్రారంభంలో మరింత ధర స్థిరత్వం (price stability), ఖచ్చితమైన ధర నిర్ణయం (price discovery) సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఎక్విటీస్ విభాగంలో అమలులో ఉన్న ప్రీ-ఓపెన్ కాల్ ఆక్షన్ మెకానిజంను ఇప్పుడు సింగిల్ స్టాక్, ఇండెక్స్‌లపై ఉన్న ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు విస్తరిస్తున్నారు. ప్రీ-ఓపెన్ సెషన్ ప్రస్తుత నెల (current month) ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు వర్తిస్తుంది. అయితే, ప్రస్తుత నెల కాంట్రాక్ట్ గడువు ముగియడానికి చివరి ఐదు ట్రేడింగ్ రోజులలో.. తర్వాతి నెల (next month) ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు కూడా వర్తిస్తుంది. స్ప్రెడ్ కాంట్రాక్టులు, స్టాక్స్, ఇండెక్స్‌లపై ఉన్న ఆప్షన్లు అలాగే.. కార్పొరేట్ చర్యల (corporate actions) వల్ల ఏర్పడిన ఎక్స్-డేట్ (ex date) ఫ్యూచర్స్ ఈ సెషన్ పరిధిలో ఉండవు.

ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 9:00 నుంచి 9:15 వరకు మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొదటగా ఆర్డర్ ఎంట్రీ పీరియడ్ (9:00 AM – 9:08 AM) ఉంటుంది. ఇందులో మార్కెట్ పాల్గొనేవారు తమ ఆర్డర్‌లను ఎంటర్ చేయవచ్చు. అలాగే మార్చవచ్చు లేదా రద్దు కూడా చేయవచ్చు. ఈ వ్యవధి 7-8 నిమిషాల మధ్య యాదృచ్ఛికంగా (randomly) ముగుస్తుంది. తర్వాతి ఆర్డర్ మ్యాచింగ్, ట్రేడ్ కన్ఫర్మేషన్ పీరియడ్ (9:08 AM – 9:12 AM) జరుగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande