వివేకానంద హత్య కేసు. నాంపల్లి కోర్టులో సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ నేడు నాంపల్లిలో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కడప జైలులో దస్తగిరిని డాక్టర్ చైతన్య బెదిరించిన ఘటనపై సీబీఐ (Cbi) ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. అలాగే 2017 ఎమ్
నాంపల్లి కోర్టు


హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)

వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ నేడు నాంపల్లిలో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కడప జైలులో దస్తగిరిని డాక్టర్ చైతన్య బెదిరించిన ఘటనపై సీబీఐ (Cbi) ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. అలాగే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనుక అవినాశ్ రెడ్డి కుట్ర కోణాన్ని ఇప్పటివరకూ ఎందుకు తేల్చలేదన్నారు. ఆరుగురు సాక్షులు మృతి చెందడంపై సీబీఐ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందన్నారు. కల్లూరు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారని, కానీ ఎందుకు రక్షించలేకపోయారని ప్రశ్నించారు. మిగిలిన నిందితులు దర్యాప్తు వద్దని ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సునీల్ యాదవ్ పిటిషన్లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande