హైదరాబాదులో వింత వాతావరణం.. ఉదయం ఎండలు మధ్యాహ్నం తర్వాత వర్షాలు
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలో మరోసారి వింత వాతావరణ నెలకొంది. ఉదయం ఎండలు మండిపోతుండగా.. మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి ఎ
వర్షాలు


హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ నగరంలో మరోసారి వింత

వాతావరణ నెలకొంది. ఉదయం ఎండలు మండిపోతుండగా.. మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి ఎండ ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం.. తాజాగా నగరంలో మోస్తారు. వర్షాన్ని కురిపిస్తుంది. ఇప్పటికే నగరం మొత్తాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇప్పటికే మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లపై వర్షపు నీరు చేరి ట్రాఫిక్ రద్దీ పెరిగింది. వాతావరణ నిపుణుల ప్రకారం.. మరో గంట తర్వాత రామంతాపూర్, ఎల్బీ నగర్, సరూర్నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande