
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) జూనియర్ అసిస్టెంట్, ఇతర సమాన పోస్టుల నేరుగా నియామకంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నలుగురు పురుష అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని విభాగాల్లో మహిళలకు 33.33 శాతం హారిజాంటల్ పద్దతిలో రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 13 ఫిబ్రవరి 2024న జీవో నంబర్ 35 జారీ చేసిందని ఈ పద్ధతినే టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుతో సహా ఇతర నియామక సంస్థలు అమలు చేస్తున్నాయని కానీ హైకోర్టు రిజిస్ట్రార్ వర్టికల్ రిజర్వేషన్ పాటించడంతో మెరిట్ కలిగిన పురుష అభ్యర్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్లో నోటిఫికేషన్లు జీవో నంబర్ 35 ను హైకోర్టోర్టు రిక్రూట్మెంట్లో ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇవాళ జస్టిస్ పి. సామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతి రావు తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది ఈ సందర్భంగా ఎందుకు 33.33 శాతం మహిళల హారిజాంటల్ రిజర్వేషన్ పాటించలేదని రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) ను కోరారు. దీంతో సమాధానం కోసం గడువు కావాలని ప్రభుత్వం తరఫు లాయర్లు కోరడంతో తదుపరి విచారణ నవంబర్ 6కు వాయిదా వేసింది. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు