
ఖమ్మం, 4 నవంబర్ (హి.స.)
సీపీఎం నాయకులు
సామినేని రామారావు ను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఏన్కూర్ ప్రధాన సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పాతర్లపాడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ సామినేని రామారావును హత్య చేసి వారం రోజులు కావస్తున్నా ఇప్పటివరకు పోలీసులు దుండగులను పట్టుకోకపోవడం పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిర లో ఇప్పటికి ముగ్గురు సిపిఎం నాయకులను హత్యకు గురయ్యారని.. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు