బీసీల రిజర్వేషన్ పై స్టేకు వ్యతిరేకంగా నిరసనలు.
సూర్యాపేట, 4 నవంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పూలే చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఘన
నిరసనలు


సూర్యాపేట, 4 నవంబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పూలే చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఘనంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభూ మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల పై ఇది తీవ్రమైన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కోర్టు తీర్పుతో తగ్గించడం అన్యాయం అని పేర్కొన్నారు. రిజర్వేషన్లు కేవలం రాజకీయ హక్కులు కాక, సామాజిక న్యాయం సాధనకు పునాది అని గుర్తు చేశారు.

ప్రభుత్వం వెంటనే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసి బీసీ రిజర్వేషన్లను కొనసాగించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాల సంఖ్య ప్రాధాన్యానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో సముచిత హక్కులు లభించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు నినాదాలతో చౌరస్తా మారు మ్రోగించారు. తాత్కాలికంగా రహదారి పై కూర్చొని ధర్నా నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande