రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థినిలు.. ఆర్డీవో రావాలని డిమాండ్
జగిత్యాల, 4 నవంబర్ (హి.స.) జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని అరపేట శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు రోడ్డు పై బైఠాయించారు. పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ విద్యార్థులను, లెక్చరర్ లను వేధింపులకు గురి చేస్తుంద
జగిత్యాల


జగిత్యాల, 4 నవంబర్ (హి.స.)

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని అరపేట శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు రోడ్డు పై

బైఠాయించారు. పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ విద్యార్థులను, లెక్చరర్ లను వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ జాతీయ 63 ఆర్మూర్- జగిత్యాల రహదారి పై బైఠాయించారు. తక్షణమే ఆర్డిఓ వచ్చి తమ సమస్యలు వినాలని వేధింపులకు పాల్పడుతున్న

ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ను తొలగించి శాశ్వత ప్రిన్సిపాల్ ను నియమించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు

డిమాండ్ చేశారు. కాసేపు నేషనల్ హైవే పై ట్రాఫిక్ అంతరాయం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande