భారీ వర్షాలు.. నీట మునిగిన ఎంపీడీవో కార్యాలయం..
యాదాద్రి భువనగిరి, 4 నవంబర్ (హి.స.) గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువులు అన్నీ నిండుకుండలా మారి అలుగులు పోస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఊర చెరువు నిండి అలుగు పోయ
వర్షాలు


యాదాద్రి భువనగిరి, 4 నవంబర్ (హి.స.)

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువులు అన్నీ నిండుకుండలా మారి అలుగులు పోస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఊర చెరువు నిండి అలుగు పోయడంతో తహశీల్దార్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు మరికొన్ని ఇల్లు కూడా పూర్తిగా నీటమునిగాయి. అప్పట్లో తహశీల్దార్ కార్యాలయాన్ని అద్దె ఇంటిలోకి మార్చి అలాగే కొనసాగిస్తున్నారు. తిరిగి ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాలలో నీరు అంతా వెళ్లిపోయాక అదే కార్యాలయాల్లో కొనసాగించారు.

తాజాగా పడిన వర్షాలతో చెరువులు పూర్తిగా నిండి అలుగులు పోస్తుండడంతో ఎంపీడీవో కార్యాలయంలో భారీగా నీరు చేరింది. ఉదయానికి ఎంపీడీవో కార్యాలయంలోని మొదటి అంతస్తు సగానికి పైగా నీళ్లు రావడంతో వెనకాలే ఉన్న ఆర్డీవో కార్యాలయం కూడా నీట మునిగే ప్రమాదం ఉంది. దీంతో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది ఫైల్స్ అన్ని మూటగట్టి భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఆర్డీఓ కార్యాలయం ముందు ఉన్న వేపచెట్టు కూలి కార్యాలయ భవనం పై పడి ఉంది. ఆర్డిఓ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో చెట్టు కూలడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande