గర్ల్స్ కాలేజీ ముందు పోకిరీల అసభ్యకర ప్రవర్తన.. యూపీ పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ వైరల్!
ముజఫర్నగర్, 4 నవంబర్ (హి.స.) సీఎం యోగీ ఆధిత్యనాథ్ నేతృత్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు, మహిళల భద్రతకు అధిక ప్రాదాన్యం ఇస్తుంది. ఈ క్రమంలో మహిళల, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఎవరూ ఉహించని స్థాయిలో పోలీసులు చర్యలు తీసు
యూపీ పోలీస్


ముజఫర్నగర్, 4 నవంబర్ (హి.స.)

సీఎం యోగీ ఆధిత్యనాథ్ నేతృత్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు, మహిళల భద్రతకు అధిక ప్రాదాన్యం ఇస్తుంది. ఈ క్రమంలో మహిళల, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఎవరూ ఉహించని స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పోలీస్ డీపార్ట్మెంట్ కు యోగి ప్రభుత్వం పూర్తి స్వేచ్చను ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముజఫర్నగర్ జిల్లా హర్సోలీ ప్రాంతంలో మహిళల భద్రతపై పోలీసులు తమదైన రీతిలో కఠిన చర్యలు తీసుకున్నారు. అక్కడి బాలికల కాలేజీ ఎదుట తరచుగా నిలబడి విద్యార్థినులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు యువకుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువకులు నడవలేని స్థితిలో కనిపించగా, ప్రజలు దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. మహిళా భద్రత కోసం యూపీ ప్రభుత్వం (UP Govt) చేపట్టిన 'మిషన్ శక్తి' కార్యక్రమం కింద పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు పొందుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande