
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 04హి.స.)అమెరికాలో ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) చట్టం (HIRE Bill)పై కాంగ్రెస్ పార్టీ (Congress) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jai Ram Ramesh) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ఈ హైర్ బిల్లు సెనెట్ కమిటీ ఆన్ ఫైనాన్స్‌కు పంపినట్లు రమేశ్ పేర్కొన్నారు. దీని ప్రకారం.. అమెరికాలో ఉండే ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ కింద విదేశీయులను ఉద్యోగులుగా నియమించి వారికి జీతాలు చెల్లించాల్సి వస్తే ఆ మొత్తంలో 25శాతం ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుందన్నారు. ఇది అమల్లోకి వస్తే.. భారత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఈ బిల్లు భారత ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (BPO), కన్సల్టింగ్, జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)పై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నారు. ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాలు కూడా దీనికి ప్రభావితమవుతాయన్నారు. కానీ, ఎక్కువ ప్రభావం మన దేశం పైనే ఉంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ