మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
అమరావతి, 4 నవంబర్ (హి.స.)కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల పోలీసుల విచారణలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు తనకు తెలియవని, పార్టీ నాయకత్వం ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే తాను చదివాన
శ్యామల


అమరావతి, 4 నవంబర్ (హి.స.)కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల పోలీసుల విచారణలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు తనకు తెలియవని, పార్టీ నాయకత్వం ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే తాను చదివానని ఆమె అంగీకరించినట్లు సమాచారం.

గత నెల 30న కర్నూలు బస్సు ప్రమాదంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా సోమవారం శ్యామలతో పాటు కారుమూరి వెంకటరెడ్డి, టి.నాగార్జునరెడ్డి తదితరులను కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం విచారించింది.

దాదాపు గంటన్నర పాటు సాగిన విచారణలో... ప్రమాదానికి ముందు డ్రైవర్, అతడి స్నేహితుడు మద్యం తాగారని చెప్పడానికి ఆధారాలు ఏవని పోలీసులు ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాల మేరకే తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వివరించినట్లు సమాచారం.

అయితే, పోలీసు విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన శ్యామల భిన్నంగా మాట్లాడారు. వైసీపీ అధికార ప్రతినిధిగా తాను పది ప్రశ్నలు మాత్రమే అడిగానని, వాటిలో తప్పేముందని మీడియాను ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా టీడీపీ నేతలు కేసులు పెట్టడం సరికాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.

కాగా, శ్యామల విచారణ సందర్భంగా కర్నూలు డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'చలో కర్నూలు' పిలుపుతో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు పలువురు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి హడావుడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande