
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 04హి.స.)నవంబరు 3: పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చవగ్గా వస్తున్న చమురునే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న భారతదేశం.. కిందటి నెలలో (అక్టోబరు) అమెరికా నుంచి భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంది. అక్టోబరు 27వ తేదీనాటికి సగటున రోజుకు 5,75,000 బ్యారెళ్ల చొప్పున కొనుగోలు చేసింది! ప్రముఖ డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ గణాంకాల ప్రకారం 2022 తర్వాత భారత్ అమెరికా నుంచి ఈ స్థాయిలో చమురు దిగుమతి చేసుకోవడం ఇదే. నవంబరులో కూడా ఈ జోరు కొనసాగుతుందని.. రోజుకు 4 లక్షల నుంచి 4.75 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. అక్టోబరుకు ముందు అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు.. సగటున రోజుకు 3 లక్షల బ్యారెళ్ల దాకా ఉండేవి. అయితే.. రష్యా నుంచి చమురు కొనొద్దంటూ ట్రంప్ మనదేశంపై తెస్తున్న ఒత్తిడి ఈ పెరుగుదలకు కారణం కాదని.. ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. అమెరికా ముడిచమురు (డబ్ల్యూటీఐ-వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడాయిల్) ధర బ్రెంట్ ముడిచమురు ధర కన్నా తక్కువగా ఉండడం, చైనాలో చమురు డిమాండ్ తగ్గిపోవడంతో భారత రిఫైనరీలు అమెరికా ను
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ