
విజయవాడ, 4 నవంబర్ (హి.స.)వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (A38)పై తీవ్ర ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు బృందం రెండో చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేశ్‌నాయుడు (A34), పీఏలు బాలాజీ (A35), నవీన్ (A36)లపై అక్రమ ముడుపుల వసూలు, ఎన్నికల ఖర్చులకు డబ్బు పంపిణీలో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ జ్యుడీషియల్ కస్టడీలో విజయవాడ జిల్లాలో జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. తాను పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లుగా జైలు అధికారులకు తెలిపారు. దీంతో ఆయనను సిట్ అధికారులు చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV