అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్‌


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

పట్నా:/ఢిల్లీ నవంబర్ 04హి.స.) బిహార్‌ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే ‘మై-బహిన్ మాన్ యోజన’ను ప్రారంభిస్తామన్నారు. ఇందులోభాగంగా జనవరి 14న సంక్రాంతి (Makar Sankranti) రోజున రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి రూ.30వేలు కానుకగా అందచేస్తామని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బిహార్ ప్రభుత్వం ఇటీవల అక్కడి మహిళలకు నవరాత్రి కానుకగా ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసిన నేపథ్యంలో తేజస్వీ ఈ ప్రకటన చేశారు.

గత వారం ప్రతిపక్షాలు విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయంగా రాబోయే ఐదేళ్లు ఒక్కో సంవత్సరానికి మొత్తం రూ.30,000 ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదికి గాను మహిళలకు రూ.30వేలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande