జూబ్లీహిల్స్ లో బిజెపి విజయం ఖాయం.. ఎంపీ ధర్మపురి అరవింద్
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలిచి కింగ్ గా నిలుస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన దాంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన ''ఎ
ధర్మపురి అరవింద్


హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలిచి కింగ్ గా నిలుస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన దాంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' లో స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఉపఎన్నికలు బీజేపీకి కఠినంగా ఉంటాయని చాలా మంది రాజకీయ పండితులు, నెటిజన్లు చెబుతున్నారని, అయినప్పటికీ అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవనున్నారని ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ధర్మపురి అరవింద్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande