రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీల్లో భాష్యం విద్యార్దిని.గోలి.జోషియా.బంగారు.పథకం
గుంటూరు, 5 నవంబర్ (హి.స.) ,:రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీల్లో భాష్యం విద్యార్థిని గోలి జోషిత బంగారు పతకం సాఽధించినట్టు సంస్థ చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఈ నెల 1, 2, 3 తేదీల్లో శ్రీకాళహస్తిలో నిర్
రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీల్లో భాష్యం విద్యార్దిని.గోలి.జోషియా.బంగారు.పథకం


గుంటూరు, 5 నవంబర్ (హి.స.)

,:రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీల్లో భాష్యం విద్యార్థిని గోలి జోషిత బంగారు పతకం సాఽధించినట్టు సంస్థ చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఈ నెల 1, 2, 3 తేదీల్లో శ్రీకాళహస్తిలో నిర్వహించిన 69వ ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆమె ఉత్తమ ప్రతిభ చూపినట్టు మంగళవారం ఒక ప్రకటనలో వివరించారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15 వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ టీమ్‌కు కెప్టెన్‌గా జోషిత ఎంపికైనట్టు వెల్లడించారు. జోషితను వైస్‌ చైర్మన్‌ హనుమంతరావు, డైరెక్టర్‌ సాకేత్‌ రామ్‌, జడ్‌ఈఓ శివ, ప్రిన్సిపాల్‌ కిషోర్‌ తదితరులు అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande