
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి నేడు బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. షేక్ పేట్ డిజిజన్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా పారా మౌంట్ కాలనీ గేట్-3 నుంచి గేట్-2, గేట్-1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఎంఎస్ అకాడమీ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. తరవాత వెంకటగిరి వాటర్ ట్యాంకు నుంచి కృష్ణా నగర్ బీ బ్లాక్ మీదుగా యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు