ప్రముఖ.పుణ్యక్షేత్రం అన్నవరంలో.నేడు .శ్రీ సత్యదేవుని గిరిప్రదక్షణ
అమరావతి, 5 నవంబర్ (హి.స.) : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో నేడు శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ ఘనంగా జరగనుంది.. సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పల్లకీలో, మధ
ప్రముఖ.పుణ్యక్షేత్రం అన్నవరంలో.నేడు .శ్రీ సత్యదేవుని గిరిప్రదక్షణ


అమరావతి, 5 నవంబర్ (హి.స.)

: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో నేడు శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ ఘనంగా జరగనుంది.. సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పల్లకీలో, మధ్యాహ్నం 2 గంటలకు సత్య రథంపై రెండు విడతలుగా గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.. పోలీసు, వైద్య, రవాణా శాఖల సమన్వయంతో భక్తుల రక్షణ కోసం అదనపు సిబ్బందిని మోహరించారు.

కాగా, కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రతీ ఏడాది కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ నిర్వహించే విషయం విదితమే.. ఏడాది ఏడాదికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఇక, ఈ రోజు ఉదయం 8 గంటలకు పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుంది. అనంతరం కొండ దిగువన తొలిపావంచాల వద్ద నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచే భక్తుల గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది.. సుమారు 9.2 కిలో మీటర్ల మేర సాగే ఈ గిరిప్రదక్షిణలో.. భక్తులకు ఇబ్బంది కలగకుండా.. ఆహారం, పండ్లు, తాగునీరు అందించేందుకు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు అధికారులు.. ఇటీవల కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande