గండికోటకు స్వర్ణ కిరీటం
అమరావతి, 5 నవంబర్ (హి.స.) చేయితిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్‌లా కనువిందు చేస్తున్న ఈ దృశ్యం వైఎస్సార్‌ కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలోది. గ్రాండ్‌ కెనాన్‌గా పేరొందిన గండిపేట లోయ.. దక్షిణాయన కాలంలో ఇలా బంగారు వర్ణంలో వెలుగులీన
గండికోటకు స్వర్ణ కిరీటం


అమరావతి, 5 నవంబర్ (హి.స.)

చేయితిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్‌లా కనువిందు చేస్తున్న ఈ దృశ్యం వైఎస్సార్‌ కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలోది. గ్రాండ్‌ కెనాన్‌గా పేరొందిన గండిపేట లోయ.. దక్షిణాయన కాలంలో ఇలా బంగారు వర్ణంలో వెలుగులీనుతుంది. పడమటి గూటికి చేరుకుంటున్న సూర్యుడు పాలకొండల మీదుగా పెన్నా నదిలో ప్రతిబింబిస్తుంటే.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ మనోహర దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. గండికోటలోని జామా మసీదు సమీపం నుంచి కనిపిస్తున్న సౌందర్యాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande