
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)
కార్తీకపౌర్ణమి సందర్భంగా నేడు ఉదయం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేకపూజలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్దేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు