
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)
కర్ణాటకలోని బీదర్ జిల్లా హల్లిఖేడ్ లో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీటీడీసీ వ్యాను ఢీ కొనడంతో తెలంగాణకు చెందిన ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వీరు కర్ణాటకలోని గానుగాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60) గా గుర్తించారు. వీరంతా గణాగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు