ఛత్తీస్‌గఢ్‌ రైలు ప్రమాదంలో 11 కు చేరిన మృతుల సంఖ్య
బిలాస్‌పూర్, 5 నవంబర్ (హి.స.) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Fatal train accident) చోటు చేసుకుంది. ప్యాసింజర్ రైలు (Passenger train) ఒక రెడ్ సిగ్నల్‌ దాటేసి గూడ్స్ రైలును వెనుక నుండి
death-toll-in-chhattisgarh-train-accident-rises-to-11-490991


బిలాస్‌పూర్, 5 నవంబర్ (హి.స.) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Fatal train accident) చోటు చేసుకుంది. ప్యాసింజర్ రైలు (Passenger train) ఒక రెడ్ సిగ్నల్‌ దాటేసి గూడ్స్ రైలును వెనుక నుండి ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లోకో పైలట్‌ సహా కనీసం ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 11 కు చేరింది. అలాగే మరో 8 మంది తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు, రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. కొంతసేపు నిలిచిపోయిన రైలు రవాణా సేవలు కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande