అన్నవరం | సత్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
అన్నవరం, 5 నవంబర్ (హి.స.)కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అన్నవరం (Annavaram) సత్యదేవుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూ కట్టారు. భక్త జనులు స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నార
east-godavari/annavaram-devotees-flock-to-have-darshan-of-satyadev-491001


అన్నవరం, 5 నవంబర్ (హి.స.)కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అన్నవరం (Annavaram) సత్యదేవుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూ కట్టారు. భక్త జనులు స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. దైవానుగ్రహం కోసం కానుకలను సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేవాలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. ఎటువంటి అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలను చేపట్టింది. దేవాలయంతో పాటు పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది.

గిరి ప్రదక్షిణ.. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కాకినాడ (Kakinada) జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్లకు పల్లకి సేవ జరుగుతుంది. అనంతరం కొండ కింద తొలిపావంచాల వద్ద నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు సత్యరథం బయలుదేరుతుంది. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) ప్రారంభమై సుమారు 9.2 కిలోమీటర్ల మేర సాగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande