
మంగళగిరి, 5 నవంబర్ (హి.స.) మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి (Mangalagiri Narasimha Swamy) వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కన్నుల పండుగగా జరిగింది. అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో ఆద్యంతం భక్తిశ్రద్దలతో పూజ సాగింది. ఈ పడి పూజలో (Padi Pooja) రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అయ్యప్ప మాలధారణ చేసిన వారి మధ్య వారిలో ఒకరిగా కూర్చున్నారు. వేద మంత్రోచ్ఛరణలో, భజన కార్యక్రమాల నడుమ సాగిన పడిపూజలో భక్తిపారవశ్యులై ఆనందించారు. మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని నారా లోకేష్ (Nara Lokesh) ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV