మద్యం, డబ్బుల అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా.. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్
ఆదిలాబాద్, 1 డిసెంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా వాంకిడి చెక్ పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని సోమవారం ఆమె ఆకస్మిక
ఎస్పీ నితిక పంత్


ఆదిలాబాద్, 1 డిసెంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా వాంకిడి చెక్ పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల

తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని సోమవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. చెకోపోస్టు వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడి చెక్పోస్ట్ పనితీరుపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమ మద్యం, డబ్బులు ఇతర నిషేధిత వస్తువులు తరలించే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ నిఘా పెంచాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు నుండి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande