
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.)
ఫ్లైఓవర్పై నుంచి ఓ వ్యక్తి పడిపోయి
ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నగర పరిధిలోని అంబర్పేట్లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాచిగూడ నుంచి అంబర్పేట్ వైపునకు ఫ్లైఓవర్ పైనుంచి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఛే నంబర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఫ్లైఓవర్ రైలింగ్ను ఢీకొట్టి కింద పడిపోయాడు. ఈ దుర్ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..