
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో 'హిల్ట్ (Hyderabad industrial lands transformation) పేరుతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద స్కామ్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి రాజ్భవన్కు వెళ్లారు. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. 'హిల్ట్' ద్వారా భారీ కుంభకోణం జరిగే అవకాశం ఉందన్నారు.
గతంలో పరిశ్రమలకు చాలా తక్కువ ధరలకు విలువైన భూములు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు శివార్లలోని భూములు ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందని కామెంట్ చేశారు. ఈ లెక్కన పరిశ్రమల భూములు చాలా తక్కువ ధరకు.. పారిశ్రామికవేత్తల ముసుగులో ఉన్న రియాల్టర్లకు దక్కే అవకాశం ఉందన్నారు. ఇలా ఏకంగా 9 వేలకు పైగా ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్కు కన్వర్ట్ చేసే కుట్ర జరుగుతోందని తెలిపారు. ఈ 'హిల్ట్' పాలసీతో ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే అవకాశం ఉందని అన్నారు. ఇదే విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని రామ్చందర్ రావు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు