
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)
ఏలూరు, :ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన హెలికాఫ్టర్‌లో ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపినాథపట్నం వెళ్తారు. స్థానికంగా నివసిస్తున్న నాగలక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించనున్నారు. గత కొంత కాలంగా నాగలక్ష్మీ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ