
నెల్లూరు, 1 డిసెంబర్ (హి.స.)
:దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆదివారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముసురేసింది. ఆగాగి రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. సాగరతీరం కల్లోలంగా మారింది. కావలి మండలం తుమ్మలపెంట, కొత్తసత్రం సముద్రతీరం 50 అడుగుల మేర ముందుకు రావటంతోపాటు 5 అడుగులమేర అలలు ఎగసి పడుతున్నా యి. దీంతో మెరైన్ పోలీసులు పర్యాటకులను సముద్ర స్నానాలకు రాకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశామని ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. అలాగే, జేసీ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో బాలాజీరావు, ఆర్‌ఐవో వరప్రసాద్‌రావు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఎగువ నుంచి ఏక్షణమైనా వరద వచ్చే సూచనలు ఉండడంతో సోమశిలలో ఉన్న నీటినిల్వను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ