దిత్వ తుఫాను ప్రభావం తో నెల్లూరులో ఎడతెరిపు లేకుండా వర్షాలు
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.) నెల్లూరు: దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పట్టణంలోని గాంధీ బొమ్మ, కనమహాల్ సెంటర్, నిప్పు సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారుల ఇబ్బంది పడుతున్
దిత్వ తుఫాను ప్రభావం తో నెల్లూరులో ఎడతెరిపు లేకుండా వర్షాలు


అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)

నెల్లూరు: దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పట్టణంలోని గాంధీ బొమ్మ, కనమహాల్ సెంటర్, నిప్పు సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి నాట్లు వేస్తున్నారు. ఈ వర్షంతో నాట్లు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande