
కేరళ, 1 డిసెంబర్ (హి.స.)
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్
కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్కు హాజరయ్యారు. ఇందులో పలు ప్రశ్నలు ఎదురవగా.. ఆయన సమాధానాలు చెప్పారు. అంతేకాకుండా కొత్తగా పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి రాబోతున్న విజయ్ కి ఏమైనా సలహాలు ఇస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. ఈ విషయంపై స్పందిస్తూ.. నా సోదరుడు విజయ్ కి సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కాదు. నేను ఆయనకు సలహాలిచ్చే స్థాయిలో లేను. అతనికి నాకు ఎంతో అనుభందం ఉంది. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు