అక్రమ కట్టడాలపై కామారెడ్డి మున్సిపల్ అధికారుల కొరడా..
కామారెడ్డి, 1 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి మున్సిపల్ స్థలాలను అక్రమంగా కబ్జా చేసి కట్టడాలు చేపట్టిన వాటిపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. అక్రమ కట్టడ దారులకు నోటీసులు జారీ చేసి పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో కూల్చివేత చర్యలు చే
కామారెడ్డి మున్సిపల్


కామారెడ్డి, 1 డిసెంబర్ (హి.స.)

కామారెడ్డి మున్సిపల్ స్థలాలను అక్రమంగా కబ్జా చేసి కట్టడాలు చేపట్టిన వాటిపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. అక్రమ కట్టడ దారులకు నోటీసులు జారీ చేసి పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో కూల్చివేత చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల సర్వే నంబర్ 6లో అక్రమ కట్టడాలను జెసిబిలతో కూల్చివేశారు. వ్యాపారాల కోసం ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లను తొలగించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande