ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. కరీంనగర్ కలెక్టర్
కరీంనగర్, 1 డిసెంబర్ (హి.స.) ఎన్నికల విధుల పట్ల అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశించారు. సోమవారం తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి, నుస్తులాపూర్, ఇందిరానగర్, రేణికుంట గ్రామాల్లో నిర్వహిస్తున్
కరీంనగర్ కలెక్టర్


కరీంనగర్, 1 డిసెంబర్ (హి.స.)

ఎన్నికల విధుల పట్ల అధికారులు,

సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశించారు. సోమవారం తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి, నుస్తులాపూర్, ఇందిరానగర్, రేణికుంట గ్రామాల్లో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసి అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande