నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్
నాగర్ కర్నూల్, 1 డిసెంబర్ (హి.స.) గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా, సజావుగా జరిగేలా చూడాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నాాగర్ కర
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 1 డిసెంబర్ (హి.స.)

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా, సజావుగా జరిగేలా చూడాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నాాగర్ కర్నూల్ మండలంలో నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని సూచించారు. అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande