జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు : రాజన్న జిల్లా ఎస్పీ
రాజన్న సిరిసిల్ల, 1 డిసెంబర్ (హి.స.) శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ బి.గితే తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస
రాజన్న జిల్లా ఎస్పీ


రాజన్న సిరిసిల్ల, 1 డిసెంబర్ (హి.స.)

శాంతి భద్రతలను దృష్టిలో

ఉంచుకొని జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ బి.గితే తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరదాని నిబంధనలకు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డి. జే వినియోగించరాదని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande