
కామారెడ్డి, 1 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో
జరుగుతున్న ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ సోమవారం ఉదయం ఆకస్మిక పర్యటన చేపట్టారు. పట్టణ ప్రజలకు పచ్చదనం, ఆహ్లాదం అందించే లక్ష్యంతో పెద్ద చెరువు కట్టపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను ఆయన ఉదయం మార్నింగ్ వాక్ సందర్భంగా నిశితంగా పరిశీలించారు.
ట్యాంక్ బండ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఎల్లారెడ్డి పట్టణానికి ఒక కొత్త శోభ వస్తుంది. ఇది కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి, విశ్రాంతికి కూడా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు