శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదు : గజ్వేల్ ఏసీపీ
సిద్దిపేట, 1 డిసెంబర్ (హి.స.) శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు పేర్కొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏసీపీ ఆధ్వర్యంలో సోమవారం జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో శాంతిభద్రతల పటిష్ట చర్యలు ప్రారం
గజ్వేల్ ఏసీపీ


సిద్దిపేట, 1 డిసెంబర్ (హి.స.)

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు పేర్కొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏసీపీ ఆధ్వర్యంలో సోమవారం జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో శాంతిభద్రతల పటిష్ట చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మండల పరిధిలో గుర్తించిన ట్రబుల్ మాంగర్స్, సస్పెక్ట్స్ ను పిలిపించుకొని ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎటువంటి వివాదాలు, గుంపుల ఘర్షణలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు. సమాజంలో ప్రశాంతత నెలకొనేలా ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నేర చరిత్ర కలిగిన సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేయాల్సిందిగా తహసిల్దారు లకు లిఖితపూర్వకంగా సూచించినట్టు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande