25 శాతం మంది అరుణాచలంని ఒక వెకేషన్ ట్రిప్ లా చూస్తున్నారు. శివాజీ రాజా
తెలంగాణ, 1 డిసెంబర్ (హి.స.) అరుణాచలం రద్దీ గురించి సీనియర్ నటుడు శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అరుణాచలం గురించి ఎవరికీ తెలియనప్పుడు నుంచే నేను, మా మిసెస్, మా ఫ్యామిలీ 30 ఏళ్లుగా వెళ్తున్నాం. అక్కడ నాకు ల్యాండ్ కూడా ఉంది. ఇ
శివాజీ రాజా


తెలంగాణ, 1 డిసెంబర్ (హి.స.) అరుణాచలం రద్దీ గురించి సీనియర్ నటుడు శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అరుణాచలం గురించి ఎవరికీ తెలియనప్పుడు నుంచే నేను, మా మిసెస్, మా ఫ్యామిలీ 30 ఏళ్లుగా వెళ్తున్నాం. అక్కడ నాకు ల్యాండ్ కూడా ఉంది. ఇల్లు కట్టుకోవాలనుకున్నా కుదరలేదు. మేము సింపుల్గా దండం పెట్టుకొని వచ్చేస్తాం. నేను, రాజా రవీంద్ర రెగ్యులర్గా వెళ్తుంటాం అని తెలిపారు. ఇక ఇటీవలి రద్దీ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు 25 శాతం మంది అరుణాచలంని ఒక వెకేషన్ ట్రిప్లో చూస్తున్నారు. అది చూసి స్టేటస్ పెట్టుకోవాలి, ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి అనుకునే వాళ్లు పెరిగారు. వాళ్లు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ నాశనమే అన్నారు. రమణాశ్రమం చాలా సైలెంట్గా ఉంటుంది. అక్కడి వాతావరణం భక్తితో నిండిపోతుంది. వెంకటేష్, ఇళయరాజా లాంటి వారు కూడా చాలా ప్రశాంతంగా దర్శనం చేస్తారు. కానీ ఒకసారి నేను, రాజా రవీంద్ర వెళ్లినప్పుడు కొంతమంది ఫోటోలు, సెల్ఫీలు అని అరుస్తూ అల్లరి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande