'బీ ఎల్ వో లపై తీవ్ర పని ఒత్తిడితో పాటు కేసులు'.. సుప్రీం కోర్టులో టీవీకే వాదనలు
న్యూఢిల్లీ, 1 డిసెంబర్ (హి.స.) భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మంగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమీకృత సవరణ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలతో పాటు తమిళనాడులో SIR కొనసాగుతుండగా.. టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 1 డిసెంబర్ (హి.స.)

భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మంగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమీకృత సవరణ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలతో పాటు తమిళనాడులో SIR కొనసాగుతుండగా.. టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై నేడు టీవీకే పార్టీ లాయర్లు తమ వాదనలు వినిపించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs)గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందిపై అధికారులు తీవ్రమైన పని ఒత్తిడి పెడుతున్నారని పార్టీ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీనికి అదనంగా, కొన్ని ప్రాంతాలలో బీ ఎల్ వో ల (BLOs)పై పోలీసులు ఏకంగా ఎఫ్ఆర్లు (FIRs) నమోదు చేశారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం (Representation of Peoples' Act) కింద వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించడానికి దారితీయవచ్చని TVK ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షిప్త వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, తమిళనాడు SIR పిటిషన్లపై డిసెంబర్ 4న జరగబోయే విచారణలో ఈ అంశాలను కూడా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande