
తిరుపతి, 1 డిసెంబర్ (హి.స.)
:టీటీడీ పరకామణి కేసు విచారణ ఈరోజుతో (సోమవారం) పూర్తి కానుంది. ఈకేసుకు సంబంధించి డిసెంబర్ 2న నివేదికను సమర్పించాల్సిందిగా హైకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో సీఐడీ అధికారులు రేపు (మంగళవారం) హైకోర్టుకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసును అక్టోబర్ 27న సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో సీఐడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురిని సీఐడీ అధికారులు విచారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ