సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో డీసీసీల వివాదం.. మీనాక్షి రాకతో ఎండ్ కార్డు పడేనా?
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.) తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చురేపుతోంది. వ్యక్తం అధిష్టానం తమ సిఫార్సులను పట్టించుకోలేదని కొన్ని చోట్ల, పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమ
డీసీసీల వివాదం


హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ పల్లెల్లో పంచాయతీ

ఎన్నికల సందడి నెలకొన్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చురేపుతోంది. వ్యక్తం అధిష్టానం తమ సిఫార్సులను పట్టించుకోలేదని కొన్ని చోట్ల, పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమకు సామాజిక న్యాయం పేరుతో అవకాశం దూరం చేశారని మరికొన్ని చోట్ల నేతల నుంచి అసంతృప్తులు అవుతున్నాయి. ఓ వైపు క్షేత్ర స్థాయిలో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం, ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో డీసీసీల విషయంలో నేతల మధ్య కినుకు రాజకీయం అధికార పార్టీలో చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి రాబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande