
విజయవాడ, 1 డిసెంబర్ (హి.స.)విజయవాడలో ఆక్సిజన్ కొరత రోజు రోజుకి పెరుగుతుంది.. ఎటువైపు చూసిన ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి.. కానీ పచ్చదనం మాత్రం కనుమరుగయ్యింది. దానికి తోడు వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ విషయవాయువులతో గాలి కాలుష్యం కూడా పెరుగుతుంది. విజయవాడలో ప్రస్తుతం సాధారణంగా 100 ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 157 చేరుకుంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సమస్యగా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2012లో నగరంలో 1.38 లక్షల చెట్లు ఉండటం ఒక రికార్డ్‌గా నమోదైంది . కానీ 2016లో టిడిపి ప్రభుత్వం హయాంలో అనేక చెట్లు తొలగించబడ్డాయి. ఈ సమయంలోనే చెట్ల సంఖ్యను పెంచడం కోసం కొన్ని చర్యలను చేపట్టారు.. కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రణాళిక ఆగిపోయింది.
విజయవాడకు 2016లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న నగరాల్లో.. మూడో స్థానం లభించింది. ఒక చదరపు కిలోమీటర్ కు 31,000 మంది ఉన్నప్పుడు 15 లక్షల జనాభా కు కేవలం లక్ష చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విషయం ప్రకారం ఆక్సిజన్ కోసం ఎంత తీవ్రతను అనుభవిస్తున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. విజయవాడలో వేసవి కాలం వచ్చిందంటే 40 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిలో చెట్ల కొరత వలన వేడి మరింతగా పెరుగుతుంది.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV