
అమలాపురం, 1 డిసెంబర్ (హి.స.)
చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1న జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని కిమ్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు) కోరారు. ఆయన ఆదివారం అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మ, అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడుతో కలిసి కిమ్స్ వైద్యకళాశాలలో ప్రపంచ తెలుగు మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. గత రెండు సభలను రాజమహేంద్రవరంలో నిర్వహించామని తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో 3వ మహాసభలను అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చైతన్యరాజు చెప్పారు. కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ