
యాదగిరిగుట్ట, 1 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో సోమవారం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక గిరిప్రదక్షిణ నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మాలధారణ భక్తుల సామూహిక గిరి ప్రదక్షిణ పర్వం పెద్ద సంఖ్యలో జరిగింది. వేకువ జామున కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ చేపట్టారు. కాగా గుట్ట చరిత్రలోనే రెండవ సారి ఆలయ అధికారులు అయ్యప్ప స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు